Cricket: మాస్కులతో మైదానంలోకి దిగిన లంకేయులు... తొలివికెట్ కోల్పోయిన టీమిండియా

  • తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 373 పరుగులు   
  • ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన టీమిండియా
  • మరోసారి ఇబ్బంది పడ్డ లక్మల్

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు 373 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం టీమిండియా బ్యాటింగ్ కు దిగగా, లంక ఆటగాళ్లు మాస్కులు ధరించి మైదానంలోకి దిగారు. ఓపెనర్ మురళీ విజయ్ (9) ను పేసర్ లక్మల్ అవుట్ చేశాడు. అనంతరం లక్మల్ వాతావరణ కాలుష్యం కారణంగా బౌలింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డా, బౌలింగ్ కొనసాగించాడు.

ఈ క్రమంలో 5వ ఓవర్ రెండో బంతికి రహానేకు బంతి వేసి అప్పీలు చేశాడు. అంపైర్ కూడా దానిని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే రహానే రివ్యూ అప్పీల్ చేయడంతో థర్డ్ అంపైర్ దానిని నాట్ ఔట్ గా ప్రకటించాడు. ఓవర్ పూర్తి చేసిన లక్మల్ మైదానంలో మరోసారి వాంతులు చేసుకోగా, ఫిజియో వచ్చి ఉపశమనం కలిగేలా చేశాడు. అనంతరం పెరీరా ఓవర్ లో మరోసారి రహానే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో టీమిండియా 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ఇప్పటికి మొత్తం మీద టీమిండియా 188 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

More Telugu News