sidhartha: అమ్మాయికి రక్షణ... చెప్పుతో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్!: హైదరాబాద్ యువకుడి ఆవిష్కరణ!

  • అమ్మాయిల రక్షణకు వినూత్నంగా ఆలోచించిన హైదరాబాద్ యువకుడు
  • పిజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆధారంగా పనిచేసే చెప్పులు
  • కొట్టగానే విద్యుదాఘాతం, సమాచారాన్ని బట్వాడా చేసే పాదరక్షలు

అమ్మాయిలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, ఓ హైదరాబాద్ యువకుడు వినూత్నంగా ఆలోచించి, నాలుగేళ్ల పాటు కష్టపడి, మహిళలకు ఉపయోగకరంగా ఉండే పాదరక్షలు తయారు చేశాడు. హిమాయత్ నగర్ లో ఉండే మండల సిద్ధార్థ అనే యువకుడు, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్ తరువాత రీసెర్చ్ పై దృష్టిని సారించాడు. సోషల్ మీడియా ద్వారా శాస్త్రీయ అంశాలు, సాంకేతిక నిపుణుల సలహాలు స్వీకరించి, చెప్పుతో కొట్టగానే ఎదుటి వ్యక్తికీ షాకిచ్చే పాదరక్షలను తయారు చేశాడు. ఆ వెంటనే సదరు సమాచారం కుటుంబ సభ్యులకు, పోలీసులకు చేరిపోతుంది.

'పిజో ఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్‌' సూత్రం ఆధారంగా పనిచేసే ఈ చెప్పుల్లో అమర్చిన బ్యాటరీలు నడుస్తూ ఉంటే చార్జింగ్ అవుతుంటాయి. ఎవరినైనా కొడితే, ఆ వ్యక్తికి స్వల్ప విద్యాదాఘాతం తగులుతుంది. ఆ వెంటనే ఇందులోని సెన్సర్లు సమాచారాన్ని చేర్చాల్సిన వాళ్లకు చేరుస్తాయి. ఇక ఈ చెప్పులను వాడుకోవడం ద్వారా అమ్మాయిలు తమను తాము సకాలంలో రక్షించుకోవచ్చని చెబుతున్నాడు సిద్ధార్థ. తన ప్రొడక్టుకు పేటెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చదవడమే తన లక్ష్యమని చెబుతున్న సిద్ధార్థకు ఆల్ ది బెస్ట్!
సిద్ధార్థ తయారు చేసిన షాకిచ్చే చెప్పులు 

More Telugu News