weather: పెరిగిన చలిపులి... లంబసింగిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత!

  • ఏపీలో పెరుగుతున్న చలి తీవ్రత
  • 'ఆంధ్రా ఊటీ' అరకు పరిసరాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు 
  • లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రత

ఏపీలో చలి పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు పరిసరాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోదకొండమ్మ పాదాలులో 7 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఘాట్ రోడ్ కేంద్రంగా పేర్కొనే పాడేరు, అరకుల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. పొద్దెక్కినా మంచుతెరలు వీడడం లేదు. 

  • Loading...

More Telugu News