mahendra singh dhoni: మొహాలీ వన్డే తరువాత మహేంద్రసింగ్ ధోనీ అనే శునకానికి రిటైర్మెంట్!: పంజాబ్ పోలీస్ ప్రకటన

  • పంజాబ్ పోలీస్ విభాగంలో డాగ్ స్క్వాడ్ లో విధులు నిర్వర్తించే శునకం ధోనీ 
  • ధోనీతో పాటు జాన్, ప్రీతి అనే శునకాలకు కూడా రిటైర్మెంట్
  • 2011లో వరల్డ్ కప్ సందర్భంగా భారత్-పాక్ మ్యాచ్ లో విధులు నిర్వర్తించిన ధోనీ

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగనున్న రెండో వన్డే అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ అనే శునకం రిటైర్మెంట్ ప్రకటించనుంది. డిసెంబరు 10 నుంచి భారత్‌-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా ఈ నెల 13న రెండో వన్డే మొహాలీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ పోలీస్ విభాగంలో గత పదేళ్లుగా డాగ్ స్క్వాడ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ అనే శునకం రిటైర్మెంట్ ప్రకటించనుంది.

అంతేకాదు, ధోనీతోపాటు జాన్, ప్రీతి అనే మరో రెండు శునకాలు కూడా రిటైర్మెంట్ తీసుకోనున్నాయి. 3 నెలల వయసులో పంజాబ్ పోలీసుల వద్దకు చేరిన ధోనీ చాలా చురుకైనదని వారు చెబుతున్నారు. పగలు ఆరు నుంచి ఏడు గంటల పాటు నిద్రపోయే ధోనీ చాలా చురుగ్గా స్పందిస్తుందని వారు చెప్పారు. రిటైర్మెంట్ అనంతరం ఈ మూడు శునకాలను ఎవరైనా దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తే వారికి అప్పగిస్తామని పంజాబ్ పోలీసులు తెలిపారు. కాగా, 2011 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ధోనీ విధులు నిర్వర్తించిందని వారు తెలిపారు. 

More Telugu News