jamuna: 'మూగమనసులు'లో నేను వేసిన 'గౌరి' పాత్రను తాను చేస్తానంటూ సావిత్రి పట్టుబట్టిందట!: జమున

  • గౌరి పాత్రపై మనసు పడిన సావిత్రి 
  • ఆ పాత్ర ఆమెకి నప్పదని అక్కినేని అన్నారట 
  • ఆ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను 
  • ఇసుక తెన్నెలపై డాన్సుల వల్ల కాళ్లకి బొబ్బలు వచ్చాయి

జమున చేసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో 'మూగమనసులు' ఒకటైతే, ఆమె కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర 'గౌరి'. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఆమె తెలుగు పాప్యులర్ టీవీతో పంచుకున్నారు.

" 'మూగమనసులు' కథ పూర్తయిన తరువాత నాగేశ్వరరావును .. సావిత్రిని తీసుకున్నారు. వాళ్లిద్దరితో ఆదుర్తి సుబ్బారావు డిస్కస్ చేశారు. అప్పుడు సావిత్రి .. "నాకు అనుకున్న పాత్రను జమునకు ఇవ్వండి .. ఆ ఏడుపు పాత్ర నేను చేయను. గౌరి వేషం నాకు ఇవ్వండి .. చేస్తాను" అని ఒకటే గోల పెట్టిందట. "నువ్ లంగా వేసుకుని గెంతులు వేస్తే బాగుండదు" అని నాగేశ్వరరావు అన్నారట. అయినా సరే ఆ వేషం నేనే వేస్తానని ఆమె పట్టుబట్టినట్టు నాకు తరువాత తెలిసింది" అని చెప్పారు జమున. "సత్యభామ పాత్రకంటే ఎక్కువగా గౌరి పాత్రకి కష్టపడ్డాను. గోదావరి ఇసుక తెన్నెలపై ఎండల్లో డాన్సులు చేయడం వలన కాళ్లు బొబ్బలెక్కాయి కూడా" అని చెప్పుకొచ్చారు.  

More Telugu News