bitcoin: మొద‌టి బిట్‌కాయిన్ బిలియ‌నీర్లుగా నిలిచిన క‌వ‌ల‌లు!

  • ఫేస్‌బుక్ ఐడియా త‌మ‌దేన‌ని గ‌తంలో కేసు వేసిన కేమెరూన్‌, టేల‌ర్‌
  • న‌ష్ట‌ప‌రిహారం ద్వారా వచ్చిన మొత్తం నుంచి 11 మిలియ‌న్ డాలర్లు బిట్‌కాయిన్‌లో పెట్టుబ‌డి
  • ఇటీవ‌ల 10,000 శాతానికి పైగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ‌

ఫేస్‌బుక్ ఐడియా తమదేనని, తమ నుంచి దానిని తస్కరించాడంటూ 2009లో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ మీద కేసు వేసిన క‌వ‌ల‌లు కేమెరూన్ వింక్లేవోస్‌, టేల‌ర్ వింక్లేవోస్‌లు నేడు ప్ర‌పంచంలో మొద‌టి బిట్‌కాయిన్ బిలియ‌నీర్లుగా నిలిచారు. మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ కేసులో 65 మిలియ‌న్ డాల‌ర్ల‌ను 2009లో వారు న‌ష్ట‌ప‌రిహారంగా పొందారు. అందులో 11 మిలియ‌న్ డాల‌ర్ల‌ను 2013లో వారు బిట్‌కాయిన్‌లో పెట్టుబ‌డిగా పెట్టారు.

'జెమినీ' పేరుతో వారొక బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్‌ని ఏర్పాటు చేశారు. ప్ర‌పంచంలో మొద‌టి డిజిట‌ల్ క‌రెన్సీ మార్పిడి కేంద్రంగా జెమినీ నిలిచింది. ఇటీవ‌ల బిట్‌కాయిన్ విలువ అమాంతం 10,000 శాతానికి పైగా పెర‌గ‌డంతో మొదటి క్రిప్టోక‌రెన్సీ బిలియ‌నీర్లుగా వీరు నిలిచారు.

More Telugu News