Prudhvi: పవన్ కల్యాణ్ గురించి '30 ఇయర్స్ పృథ్వీ' భావోద్వేగపు మాటలు... వీడియో చూడండి!

  • నేనేమీ పవన్ ను పొగడడం లేదు
  • ఆయన వ్యక్తిత్వాన్ని చూసి స్పందిస్తున్నానంతే
  • ఎదురుగా ఉండే గొప్ప వ్యక్తి పవన్
కమేడియన్, '30 ఇయర్స్ ఇండస్ట్రీ'గా పేరు తెచ్చుకున్న పృథ్వీ, ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి భావోద్వేగంతో మాట్లాడారు. తాను పవన్ వ్యక్తిత్వం చూసి స్పందిస్తున్నానని, తానేమీ పవన్ ను పొగడటం లేదని చెప్పిన ఆయన, పవన్ ను చూసి ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు. ఓ కూజా, మట్టిగ్లాసును పక్కన పెట్టుకుని కూర్చునే మేధావి పవన్ అని, న్యూటన్ అంటూ పెద్ద పెద్ద శాస్త్రవేత్తల గురించి చదువుకుంటాము గానీ, ముందున్న గొప్ప వ్యక్తులను గుర్తించలేకపోతున్నామని అన్నాడు.

తనను పవన్ స్పురద్రూపిగా సంబోధిస్తుంటాడని గుర్తు చేసుకున్న పృథ్వీ, తానేమీ కొంత మందిలాగా డబ్బులు తీసుకుని మాట్లాడటం లేదని చెప్పాడు. ఆయన ఓ నడిచే అగ్నిగోళం వంటి వాడని అన్నాడు. పృథ్వీ మాటల వీడియోను మీరూ చూడవచ్చు.

Prudhvi
Pawan Kalyan
30 Years in Industry

More Telugu News