iss: అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో పిజ్జా... వీడియో చూడండి

  • ఇటాలియ‌న్ వ్యోమ‌గామి కోరిక మేర‌కు పంపిన నాసా
  • ఆనందంగా ఆర‌గించిన వ్యోమ‌గాములు
  • పిజ్జా తింటూ ఫొటోల‌కు పోజులు

అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లో నివ‌సించే వ్యోమ‌గాములు చాలా ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది. అందుకోసం వారు పోష‌కాలు ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాల‌ను తీసుకుంటారు. అయితే,  అప్పుడప్పుడు వారి నాలుక కొత్త రుచుల కోసం వెంప‌ర్లాడుతుంటుంది. అందుకే అక్క‌డ ఉన్న ఇటాలియ‌న్ వ్యోమ‌గామి పావులో నెస్పోలీ ఎక్కువ‌గా పిజ్జా గురించి త‌న ట్వీట్ల‌లో ప్ర‌స్తావిస్తుంటాడు. నాకు పిజ్జా తినాల‌నుంది, మేఘాల‌ను చూస్తుంటే పిజ్జా గుర్తొస్తోంది.. అంటూ ట్వీట్లు చేస్తుంటాడు.

ఇటీవ‌ల ఓ లైవ్ మానిట‌రింగ్ సెష‌న్‌లో కూడా తాను పిజ్జాను బాగా మిస్ అవుతున్నాన‌ని పావులో చెప్పాడు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న అమెరికా అంత‌రిక్ష కేంద్రం నాసా వారికి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఇటీవ‌ల వెళ్లిన ఆహారం స‌ర‌ఫ‌రాలో భాగంగా వారికి పిజ్జా తయారు చేసుకునే ప‌దార్థాల‌ను పంపింది.

ఇంకేం, వ్యోమ‌గాముల ఆనందానికి అవ‌ధులు లేవు. డీహైడ్రేట్ ఆహారం తిని తిని చ‌చ్చుబ‌డిన నాలుక‌కు కొత్త రుచిని త‌గిలించారు. వారు పిజ్జా తయారు చేసుకుని, గాల్లో ఎగురుతున్న పిజ్జాల‌ను తింటూ ఫొటోల‌కు పోజులిచ్చారు. అంతేకాదు.. వారి ఆనందాన్ని పంచుకుంటూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు.

More Telugu News