Undavalli Arunkumar: జగన్ చిన్నప్పటి నుంచి తెలిసున్న కుర్రాడు, ప్రేమ ఉంది... అధికారంలోకి తెచ్చేంత సమర్థత నాకు లేదు: ఉండవల్లి

  • జగన్ చేసిన పనులన్నిటినీ సమర్థించలేను
  • చిన్నప్పటి నుంచీ తెలిసున్న కుర్రాడు జగన్
  • పాదయాత్ర సీఎం పీఠం వరకూ చేరుస్తుందో లేదో చెప్పలేను
  • చంద్రబాబు అమరావతిని నేను చూడలేను

తనకు ప్రాణ మిత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా జగన్ పై తనకు ప్రేమ ఉందని, అంతమాత్రాన ఆయన చేసిన అన్ని పనులనూ సమర్థిస్తూ, ఆయనకు వ్యతిరేకమైన చంద్రబాబును విమర్శిస్తూ ఉంటాననడం అర్థరహితమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. జగన్ తనకు చిన్నప్పటి నుంచీ తెలుసునని, అతనిపై కొంత ప్రేమ కూడా ఉందని చెప్పిన ఉండవల్లి, జగన్ ను అధికారంలోకి తీసుకు వచ్చేంత సమర్థత తన వద్ద లేదని అన్నారు.

అదే ఉంటే, తానే అధికారంలో ఉండుండే వాడినని చెప్పారు. తనకా శక్తి, ఆసక్తి లేవని అన్నారు. పోలవరం ప్రాజెక్టును రాజశేఖరరెడ్డి ప్రారంభించారు కాబట్టి, తన ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి, దాని గురించిన పుట్టు పూర్వోత్తరాలు తెలుసునని చెప్పారు. ఇక అమరావతి గురించి ప్రస్తావిస్తూ, చంద్రబాబు చూపిస్తున్న అమరావతిని తాను చూడలేనని, చంద్రబాబు జన్యు పరంగా అద్భుత నిర్మాణం కలిగుండి, 130 ఏళ్లు బతుకుతాడేమోగానీ, తాను బతకనని అన్నారు. రేపు ఏమవుతుందో తనకు తెలియదని, తాను ఎవరికీ కోచ్ ని కాదని, ఎన్నికల్లో ఎలా గెలవాలన్నది తనకు తెలియదని అన్నారు. జగన్ పాదయాత్రను గురించి ఆలోచించడం లేదని, అది ఆయన్ను సీఎం పీఠం వరకూ తీసుకెళుతుందా అన్నది చెప్పే మూడ్ లేదని ఉండవల్లి అన్నారు.

  • Loading...

More Telugu News