Supreme Court: ఆలస్యానికి మమ్మల్ని క్షమించండి: సుప్రీంకోర్టు అరుదైన వ్యాఖ్య

  • ఓ మహిళ కేసు విచారణ పదేళ్లు ఆలస్యం
  • సుప్రీంకోర్టులోనే ఎనిమిదేళ్లు సాగిన విచారణ
  • విచారణ దశలోనే మరణించిన ఫిర్యాదిదారు
  • పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం

ఓ కేసు విచారణ పది సంవత్సరాలు ఆలస్యం కావడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఓ మహిళకు క్షమాపణలు తెలిపిన అరుదైన సందర్భమిది. తన సోదరులు ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి, తన షాపును ఆక్రమించుకున్నారని 2004లో ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీకి చెందిన శ్యామలత ఫిర్యాదు చేయగా, కేసు స్థానిక కోర్టుకు చేరింది. అదే కోర్టులో శ్యామలత ఓ సోదరుడు కూడా ఫిటిషన్ వేయగా, కేసు ఏళ్ల తరబడి సాగింది.

 స్థానిక కోర్టులో ఓ తీర్పు, ఆపై ఉత్తరాఖండ్ హైకోర్టులో మరో తీర్పు వచ్చాయి. ఆపై ఫిర్యాదిదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం, ఇలా పరస్పర విరుద్ధ తీర్పులు రావడంతో కేసు వ్యవహారం గందరగోళంగా మారిందని చెబుతూ, ఆదిలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పే ఈ కేసుకు వర్తిస్తుందని చెబుతూ, విచారణ పదేళ్లు ఆలస్యమైనందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ, క్షమాపణలు కోరింది. అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు 2009 నుంచి సాగుతుండగా, కేసు వేసిన కొద్ది రోజులకే శ్యామలత మరణించడం గమనార్హం.

More Telugu News