Jayalalitha: జయలలిత-శోభన్ బాబు సహజీవనం నిజమే.. 1979లో స్వయంగా అంగీకరించిన జయ!

  • శోభన్ బాబు వివాహితుడు కావడం వల్లే పెళ్లి చేసుకోలేకపోతున్నానన్న జయ
  • 1979లో ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ
  • డీఎన్ఏ పరీక్షకు సిద్ధమంటూ కర్ణాటక హైకోర్టుకు అమృత!

జయలలిత మరణం తర్వాత ఆమె వైవాహిక బంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కొడుకునంటూ ఒకరు, కూతురినంటూ మరొకరు కోర్టులను ఆశ్రయించారు. వారి విషయంలో నిజానిజాలను అటుంచితే ఇటీవల కోర్టుకెక్కిన బెంగళూరుకు చెందిన మంజుల అలియాస్ అమృత విషయం ఇప్పుడు తమిళ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఆమె జయకు, నటుడు శోభన్ బాబుకు పుట్టిన సంతానమేనని జయ స్నేహితురాలు కూడా తెలిపారు. ఈ విషయాన్ని శోభన్ బాబే తనతో స్వయంగా చెప్పారని పేర్కొన్నారు.

అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం బయటపడింది. శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, ఆయన వివాహితుడు కావడంతో పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించారు. ఈ మేరకు స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ రాశారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు.. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా చెప్పడం గమనార్హం.

 అమృత పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఆగస్టు 14, 1980లో జయలలితకు అమృత జన్మించారు. పెంపుడు తల్లి శైలజ 2015లో, తండ్రి ఈ ఏడాది మార్చి 20న మృతి చెందారు. జన్మనిచ్చిన తల్లి బతికి ఉన్నప్పుడు తాను కుమార్తెనని ప్రకటిస్తే ఆమె కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతింటాయని భావించి ఇన్నాళ్లు దాచిపెట్టినట్టు అమృత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశంతో అమృత ఇప్పుడు కర్ణాటక కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

More Telugu News