Iran: ఇరాన్‌లో భారత్ నిర్మించిన చాబహర్ పోర్టు ప్రారంభం.. ఇక చైనా, పాక్‌లకు చెక్!

  • ప్రారంభించిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ
  • భారత్ సహా 17 దేశాల ప్రతినిధులు హాజరు
  • మూడింతలు కానున్న ఇరాన్ కార్గో సామర్థ్యం

భారత్ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. పక్కలో బల్లెంలా తయారైన చైనా, పాకిస్థాన్‌లకు ఒకేసారి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహర్ పోర్టు తొలి దశ ప్రారంభమైంది. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదివారం దీనిని ప్రారంభించగా, భారత్ తరపున కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, సహా 17 దేశాల నుంచి వచ్చిన 60 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలి దశలో పూర్తయిన ఈ పోర్టును షాహిద్ టెహెస్తీ పోర్టుగా వ్యవహరిస్తారు.

ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, భారత్ మధ్య వాణిజ్య రవాణాకు ఈ పోర్టు ఎంతో కీలకం కానుంది. తమ భూభాగం గుండా భారత్-ఆఫ్ఘాన్ మధ్య వాణిజ్య రవాణాకు పాకిస్థాన్ అడ్డంకులు సృష్టిస్తుండడంతో దీనిని నిర్మించారు. భారత్ సాయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు భవిష్యత్తులో మరింత  కీలకం కానుంది. పాక్‌లో చైనా నిర్మించిన గ్వదర్ పోర్టుకు ఇది కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం.

షాహిద్ టెహెస్తీ పోర్టు ద్వారా ఇరాన్ వాణిజ్య లావాదేవీలు మూడింతలు అధికం కానున్నాయి.  ప్రస్తుతం 2.5 మిలియన్ టన్నులుగా ఉన్న కార్గో సామర్థ్యం ఇప్పుడు 8.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. పోర్టు ప్రారంభం అనంతరం అధ్యక్షుడు హసన్ రౌహానీ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. ముఖ్యంగా చాబహర్ ప్రజలకు చాలా ముఖ్యమైన రోజని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News