jamuna: ఆ ఇద్దరు హీరోలు నన్ను పక్కన పెట్టేసినా నేను ప్రాధేయపడలేదు: జమున

  • కథ .. నా పాత్ర ఎలా ఉందనేది మాత్రమే చూసే దానిని 
  • హీరో ఎవరనే విషయాన్ని పట్టించుకునే దానిని కాదు 
  • ఇదే విషయాన్ని ఒక హీరో అడిగారు 
  • అప్పుడు నేను అలా చెప్పాను        

ప్రముఖ నటి జమున తన కెరియర్ కి సంబంధించిన విషయాలను తెలుగు పాప్యులర్ టీవీతో పంచుకున్నారు. ఆనాటి సంగతులను చెబుతూ  "మొదటి నుంచి నేను కథ బాగుందా లేదా? .. నా పాత్ర బాగుందా లేదా? అనే చూసేదానిని. ఇక హీరో ఎవరనే విషయాన్ని ఎప్పుడూ పట్టించుకునే దానిని కాదు. ఫలానా హీరోతోనే చేస్తానని అనే దానిని కాదు. అలా ఎన్టీఆర్ తో పాటు అక్కినేని .. కృష్ణ .. హరనాథ్ .. జగ్గయ్య లతో నటిస్తూ వస్తున్నాను. ఒక స్టేజ్ లో ఈ ఇద్దరు ప్రముఖ హీరోల్లో ఒక హీరో .. "మన కాంబినేషన్ బాగుంటుందని దర్శకులకు చెప్పాలి గదా .. నీ ఇష్టం వచ్చిన వాళ్లతో చేసేస్తావు" అని నోరు తెరిచి అడిగారు.

"ఫలానా హీరోతో చేస్తానని .. ఫలానా హీరోయిన్ తో చేస్తానని అప్పట్లో కొంతమంది చెప్పేవాళ్లు" .. "అట్లా నువ్వెందుకు చెప్పవ్" అని అన్నారు. "నాకు అలవాటు లేదండి .. దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేసుకుంటారు" అన్నాను. ఆ హీరోలు నన్ను పక్కన పెట్టేసినా నేను ప్రాధేయపడలేదు. వాళ్లు బాయ్ కాట్ చేశారని కాదు గానీ .. మొదటి నుంచి కూడా వేరే హీరోలతో చేస్తూనే వచ్చాను .. ఆ తరువాత కూడా అదే చేస్తూ వచ్చాను " అన్నారు.       

More Telugu News