raviteja: రవితేజ న్యూ మూవీకి సన్నాహాలు .. లొకేషన్ల వేటలో శ్రీను వైట్ల!

  • శ్రీను వైట్లతో రవితేజ సినిమా 
  • ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి 
  • త్వరలో మిగతా నటీనటుల ఎంపిక

ప్రస్తుతం రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ  ప్రాజెక్టు తరువాత రవితేజతో సినిమాలు చేయడానికి కల్యాణ్ కృష్ణ .. శ్రీను వైట్ల సిద్ధంగా వున్నారు. అయితే ఈ ఇద్దరిలో శ్రీను వైట్ల తన సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

 కథా పరంగా ఈ సినిమా షూటింగ్ అమెరికాలోను జరగనుందట. అందువలన లొకేషన్స్ చూడటానికి శ్రీను వైట్ల అమెరికా వెళ్లాడు. అక్కడి లొకేషన్స్ ను ఖరారు చేసుకుని త్వరలోనే ఆయన తిరిగి రానున్నాడని అంటున్నారు. ఆల్రెడీ ఆయన పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేయడం .. రవితేజ - నిర్మాతలు ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. మిగతా నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేయవలసి ఉందంతే.  

More Telugu News