Cricket: తొలి బంతికే వికెట్ తీసిన షమీ!

  • తొలి ఇన్నింగ్స్ 536 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్
  • విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ
  • తొలిబంతికే కరుణ రత్నె వికెట్ తీసిన షమీ
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడోటెస్టు మొదటి ఇన్నింగ్స్ ను 536 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (243) విశ్వరూపం ప్రదర్శించడానికి తోడు మురళీ విజయ్ (155), రోహిత్ శర్మ (65) రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.

ఏడు వికెట్లు కోల్పోయిన అనంతరం...బ్యాటింగ్ చేయించడం ద్వారా బౌలర్లను ఇబ్బంది పెట్టడం వల్ల ఉపయోగం లేదని భావించిన కోహ్లీ 536 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అనంతరం శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించగా, తొలి బంతినే అద్భుతంగా సంధించిన మహ్మద్ షమి లంక ఓపెనర్ కరుణ రత్నేను బలిగొన్నాడు. దీంతో పరుగులేమీ లేకుండానే శ్రీలంక జట్టు వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పెరీరా (10), డిసిల్వా ఆడుతున్నారు. 
Cricket
team india
srilanka
3rd test
delhi

More Telugu News