Virat Kohli: విరాట్ కోహ్లీ ఆరో డబుల్ సెంచరీ.. ఇండియా 451/4

  • శ్రీలంకతో న్యూఢిల్లీలో టెస్టు మ్యాచ్
  • రెండో రోజూ రెచ్చిపోయిన కెప్టెన్ కోహ్లీ
  • టెస్టుల్లో ఆరో డబుల్ సెంచరీ నమోదు
  • భారీ ఆధిక్యంలో భారత్
ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజున భారత్ ఆధిక్యం భారీగా పెరుగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేయడంతో పాటు, తన కెరీర్ లో ఆరో డబుల్ సెంచరీని నమోదు చేయడం రెండో రోజు ఆటలో విశేషం. విరాట్ కు తోడుగా, నిన్నంతా మెరుపులు మెరిపించిన మురళీ విజయ్ 155 పరుగుల వద్ద సందకన్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ రూపంలో పెవీలియన్ దారి పట్టాడు.

ఆ తరువాత బరిలోకి దిగిన రహానే నిరాశపరుస్తూ ఒక్క పరుగుకే అవుట్ అయినప్పటికీ, కోహ్లీలో జోరు తగ్గలేదు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ నుంచి మంచి సపోర్టు లభిస్తుండటంతో తనదైన షాట్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అందుకోసం 238 బంతులను కోహ్లీ వాడుకున్నాడు. 20 ఫోర్లు కొట్టాడు. అతనికి తోడుగా ప్రస్తుతం రోహిత్ శర్మ 40 పరుగులతో క్రీజులో ఉండగా, భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 451 పరుగులు.
Virat Kohli
India
Sri Lanka
Cricket
Double century

More Telugu News