Nani: శ్రీకాంత్ హీరోగా నటిస్తుంటే, నాడు క్లాప్ పట్టుకుని నిలుచున్న నాని... చూడండి!

  • కెరీర్ తొలినాళ్ల గురించిన ఆసక్తికర ఫోటో
  • బాపు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని
  • 'రాధాగోపాళం' చిత్రం షూటింగ్ వేళ తీసిన ఫోటో
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నాళ్లలో తన కెరీర్ గురించిన ఓ ఆసక్తికర ఫోటోను హీరో నాని పంచుకున్నాడు. సహాయ దర్శకుడిగా మొన్నటి వరకూ పనిచేస్తూ, ఇప్పుడు 'నాచురల్ స్టార్' గా గుర్తింపు తెచ్చుకున్న నాని, ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, దిగ్గజ దర్శకుడు బాపు దగ్గర తాను పనిచేసిన వేళ, ఆయన దర్శకత్వం వహించిన 'రాధాగోపాళం' చిత్రం షూటింగ్ వేళ తీసిన చిత్రమిది.

శ్రీకాంత్ హీరోగా, స్నేహ హీరోయిన్ గా నటిస్తున్న వేళ, వారిద్దరికీ బాపు సూచనలు అందిస్తుంటే, వెనుకే క్లాప్ పట్టుకుని నిలుచున్నాడు నాని. ఆనాటి ఫోటోను మీరూ చూడండి. మీసాలు కూడా రాని వయసులో నడుముపై చెయ్యి పెట్టుకుని బాపు వెనకాల క్లాప్ పట్టుకుని సిద్ధంగా ఉన్న యువకుడే నాని.
Nani
Bapu
Assistant Director
Natural Star

More Telugu News