Sabarimala: మహోగ్రంగా ప్రవహిస్తున్న పంబా నది... శబరిమల తాజా వీడియో!

  • ఓకీ తుపానుతో కేరళలో అతి భారీ వర్గాలు
  • మండల సీజన్ లో శబరిమలలో భక్తుల అవస్థలు
  • ఎరుమేలి - పంబ ఆటవీ మార్గం మూసివేత
  • భక్తులకు హెచ్చరికలు జారీచేసిన టీబీడీ

ఓకీ తుపాను ప్రభావంతో కేరళ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తుండగా, గత నెలలో మండల సీజన్ ప్రారంభమైన శబరిమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవుల్లో కురుస్తున్న వర్షాలకు పంబానది మహోగ్రంగా ప్రవహిస్తుండగా, సన్నిధానానికి వెళ్లే దారులన్నీ జలమయం అయ్యాయి. వాహనాలను పార్కింగ్ చేసే ప్రాంతాల్లో నీరు నిండిపోగా, పలు వాహనాలు నీట మునిగాయి.

ఇప్పటికే ఎరుమేలి - పంబ అటవీ మార్గాన్ని మూసివేసిన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు, చాలా పరిమిత సంఖ్యలోనే భక్తులను పంబ వరకూ అనుమతిస్తోంది. దీంతో ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకుని, స్వామి దర్శనానికి కేరళ వెళుతున్న తెలుగు రాష్ట్రాల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంబా నదిలో ఎవరూ స్నానాలకు దిగవద్దని, తదుపరి సమాచారాన్ని ఇచ్చేవరకూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలోనే భక్తులు ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పంబా నదిని, శబరిమల తాజా పరిస్థితిని చూపుతున్న వీడియో ఇది!

More Telugu News