KTR: మెట్రోరైలు సౌకర్యాన్ని శంషాబాద్ వరకు విస్తరిస్తాం: కేటీఆర్

  • రెండో దశ విస్తరణలో ఈ పనులు ప్రారంభిస్తాం 
  • మరో 80 కిలోమీటర్ల మేర విస్తరణ  
  •  ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం
మెట్రో రైలు సౌకర్యాన్ని శంషాబాద్ వరకు విస్తరిస్తామని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యే ప్రారంభమైన మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని అన్నారు.

రెండో దశ మెట్రో రైలు మార్గం విస్తరణలో భాగంగా మరో 80 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే జరుగుతున్న మెట్రో పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మెట్రోలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ప్రయాణం చేసిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. 
KTR
Hyderabad
metro rail
shamshabad

More Telugu News