allu sirish: 'ఒక్క క్షణం' టీజర్ ను రేపే వదులుతున్నారు

  • అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
  • టీజర్ రిలీజ్ కి సన్నాహాలు 
  • కథానాయికగా సురభి 
  • ఈ నెల 29వ తేదీన రిలీజ్     

'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమాతో వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. కథా కథనాలకు .. ఆయన టేకింగ్ కి ఆ సినిమా మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆయన తదుపరి సినిమాగా .. అల్లు శిరీష్ కథానాయకుడిగా 'ఒక్క క్షణం' తెరకెక్కింది. సురభి కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

దాంతో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు టీజర్ ను వదలనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు ఏర్పడటం ఖాయమనే నమ్మకంతో వున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       

  • Loading...

More Telugu News