Revanth Reddy: రేపు ప్ర‌జాగ‌ర్జ‌న‌కు త‌ర‌లిరండి: రేవంత్ రెడ్డి పిలుపు

  • కేసీఆర్ ప్ర‌భుత్వంపై రేవంత్‌రెడ్డి పోరాటం
  • అచ్చం పేట నియోజ‌క వర్గంలో బ‌హిరంగ స‌భ
  • ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కాలంటూ పిలుపు
కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఇక పోరాటం మొద‌లు పెడ‌తాన‌ని చెప్పిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. రేపు నాగ‌ర్‌క‌ర్నూల్‌లోని అచ్చం పేట నియోజ‌క వర్గంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కాల‌ని, ప్రజాగర్జనకు తరలి రావాల‌ని, కాంగ్రెస్‌తో చేయి కలపండని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన త‌రువాత రేవంత్ రెడ్డి తొలిసారి స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల‌కు నిజాలు చెబుతాన‌ని రేవంత్ రెడ్డి అంటున్నారు.
Revanth Reddy
praja garjana

More Telugu News