pavan kalyan: 'అజ్ఞాతవాసి'కి హాలీవుడ్ సినిమా ఆధారమా?

  • త్రివిక్రమ్ తాజా చిత్రంగా 'అజ్ఞాతవాసి' 
  • ఓ హాలీవుడ్ మూవీ నుంచి స్ఫూర్తిని పొందాడంటూ టాక్ 
  • ఆ హాలీవుడ్ మూవీకి .. అజ్ఞాతవాసికి దగ్గర పోలికలున్నాయంటూ ప్రచారం    
పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'జల్సా' .. 'అత్తారింటికి దారేది' సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడవ సినిమాగా రూపొందుతోన్న 'అజ్ఞాతవాసి'పై అంచనాలు భారీగా వున్నాయి. ఈ నేపథ్యలో 'ది హెయిర్ అప్పారెంట్' అనే ఓ హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తిని పొందిన త్రివిక్రమ్, ఈ కథను తయారు చేసుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 శ్రీమంతుడైన ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు వుంటారు. హఠాత్తుగా ఆయన చనిపోవడంతో, ఆయన ఆస్తిపాస్తులను సొంతం చేసుకోవడానికి ఒక ముఠా ప్లాన్ చేస్తుంది. అయితే ఆ శ్రీమంతుడి మొదటి భార్యకి ఒక కొడుకుంటాడు. అతను ఎక్కడ ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదు. ఆయన కోసం సాగిన అన్వేషణ .. ఆయన వచ్చాక చోటుచేసుకునే పరిణామాలతో హాలీవుడ్ సినిమా కొనసాగుతుంది. ఈ కథకు .. 'అజ్ఞాతవాసి'కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. కథను తనదైన స్టైల్లో చెప్పడంలో త్రివిక్రమ్ నేర్పరి కనుక, తెరపై ఆయన ఎలాంటి మేజిక్ చేశాడో చూడాలి మరి.     
pavan kalyan
keerthi suresh
anu emmanuel

More Telugu News