3rd test: మూడో టెస్ట్.. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ!

  • ఓపెనర్లకు ఛాలెంజ్ అన్న కోహ్లీ  
  • టీమిండియా జట్టులో రెండు మార్పులు
  • తొలుత బ్యాటింగ్ చేసేవారికి పిచ్ అనుకూలం

భారత్-శ్రీలంకల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మూడో టెస్టు జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, తొలి రోజు తొలి సెషన్ బౌలర్లకు అనుకూలిస్తుందని... భారత్ ఓపెనర్లకు ఇదొక ఛాలెంజ్ అని అన్నాడు. మరోవైపు టీమిండియా జట్టులో రెండు మార్పులు జరిగాయి. మొహమ్మద్ షమీ, శిఖర్ ధావన్ లు జట్టులోకి వచ్చారు. ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతినిచ్చారు. శ్రీలంక జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తిరిమన్నే, షనక, హెరాత్ ల స్థానంలో సందకన్, రోషన్ సిల్వ, ధనంజయ డీసిల్వాలు జట్టులోకి వచ్చారు.

పిచ్ విషయానికి వస్తే... వికెట్ పై కొంచెం గడ్డి ఉంది. అయితే ఈ గడ్డి ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టే రీతిలో మాత్రం ఉండదని సునీల్ గవాస్కర్ తెలిపారు. తొలుత బ్యాటింగ్ చేసే వారికి పిచ్ అనుకూలిస్తుందని చెప్పారు.

More Telugu News