Chandrababu: మేము ఎప్పుడూ పదవుల కోసం వెంపర్లాడలేదు: చంద్రబాబు

  • రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
  • బీజేపీ టార్గెట్ కాదు
  • ప్రజల్లో సెంటిమెంట్ దెబ్బతినకుండా చూసుకోవాలి
ప్రజల సమస్యల పరిష్కారమే మన లక్ష్యమని... బీజేపీ మన టార్గెట్ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి లేఖ వచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో, టీడీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్రంలో టీడీపీ మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా తాము పదవుల కోసం వెంపర్లాడలేదని ఆయన అన్నారు. ఏడు మంత్రి పదవులు ఇస్తామని మాజీ ప్రధాని వాజ్ పేయి ఆఫర్ ఇచ్చినా... తాము తీసుకోలేదని చెప్పారు.

కేంద్రంతో మంచి సంబంధాల కోసం అప్పట్లో బాలయోగికి స్పీకర్ పదవి తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు కూడా అవే సంబంధాల కోసం రెండు పదవులు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని... అంతకు మించి కేంద్రాన్ని తాము ఏదీ అడగడం లేదని అన్నారు. ప్రజల్లో సెంటిమెంట్ దెబ్బ తినకుండా చూసుకోవాలని టీడీపీ నేతలకు ఆయన హితవు పలికారు. మన ప్రవర్తనను బట్టే ప్రజల్లో సానుకూలత ఉంటుందని చెప్పారు. ప్రజలతో మమేకమై తిరగాలని సూచించారు. 
Chandrababu
vajpayee
Telugudesam
BJP

More Telugu News