Jayalalitha: అమృత.. జయలలిత కూతురే.. శోభన్ బాబు కూడా చెప్పారు!: స్పష్టం చేసిన జయలలిత స్నేహితురాలు గీత

  • శోభన్‌బాబుకు, జయలలితకు ఆమె జన్మించింది
  • ఈ విషయాన్ని శోభన్‌బాబు నాతో చెప్పారు
  • డీఎన్ఏ పరీక్షల్లోనే అసలు విషయం తేలుతుందన్న గీత

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె నంటూ కోర్టును ఆశ్రయించిన అమృత జయలలిత కుమార్తేనని జయలలిత స్నేహితురాలు గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటుడు శోభన్ బాబు, జయలలితకు ఆమె జన్మించిందని పేర్కొన్నారు. జయ సన్నిహితురాలు శశికళకు కూడా ఈ విషయం తెలుసన్నారు.

1999లో తానోసారి శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు తనకో కుమార్తె ఉన్న విషయాన్ని శోభన్ బాబు తనతో ప్రస్తావించారని, ఆమె పేరు అమృత అని చెప్పారని గీత గుర్తు చేసుకున్నారు. 1996 నుంచి జయలలితతో అమృతకు సంబంధాలు ఉండేవన్నారు. అమృత.. జయలలిత కూతురా? కాదా? అన్న విషయం డీఎన్ఏ పరీక్షల్లోనే తేలుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని గీత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News