Chandrababu: ఉమెన్ పార్లమెంట్ నిర్వహించినందుకు.. స్పీకర్ కోడెలకు చంద్రబాబు కంగ్రాట్స్!

  • అమరావతి డిక్లరేషన్ తో మహిళలకు పట్టాభిషేకం
  • దీనికి కారకులైన కోడెలకు అభినందనలు
  • ఉమెన్ పార్లమెంట్ మహిళా లోకానికే స్ఫూర్తిదాయకం
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మహిళా సాధికారత కోసం అమరావతి డిక్లరేషన్ తీసుకొచ్చామని, అందుకు ప్రధాన కారకులైన కోడెలకు అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగనుందని తెలిపారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వివిధ రంగాలకు చెందిన లక్షలాది మంది యువతులతో పవిత్ర సంగమం వద్ద స్పీకర్ నిర్వహించిన ఉమెన్ పార్లమెంట్ మహిళా లోకానికే స్ఫూర్తిదాయకమని చంద్రబాబు నాయుడు చెప్పారు. 
Chandrababu
kodela siva prasad
ap speaker

More Telugu News