air asia: ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఏసియా ప్ర‌త్యేక ఆఫ‌ర్‌లు!

  • ఎయిర్ ఏసియా ఎంపిక చేసిన రూట్లలో 40 శాతం తగ్గింపు ధ‌ర‌కే టిక్కెట్లు
  • ఇండిగో విమానాల్లో ఎంపిక చేసిన రూట్లలో ప్రారంభ ధర రూ.1,112
  • విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు ధ‌ర‌ రూ.1,259

ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఏసియా ప్ర‌త్యేక ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించాయి. ఎయిర్ ఏసియా లిమిటెడ్‌ పిరియడ్‌ ప్రమోషనల్‌ స్కీమ్‌ కింద ఎంపిక చేసిన రూట్లలో 40 శాతం తగ్గింపును ఆఫ‌ర్ చేస్తోంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి వీటి కోసం బుకింగ్స్ చేసుకోవ‌చ్చు. వ‌చ్చేనెల‌ 15 నుంచి ఏప్రిల్‌ 25 మధ్య ప్రయాణం చేయ‌వ‌చ్చు.
 
అలాగే ఇండిగో విమానాల్లో ఎంపిక చేసిన రూట్లలో టికెట్‌ ప్రారంభ ధరను రూ.1,112కే అందుకోవ‌చ్చు.  

ఇండిగో ఆఫ‌ర్‌ వివ‌రాలు..

  • జమ్ము-శ్రీనగర్‌ టికెట్‌ ధర రూ.1,112
  • కోయంబత్తూరు- చెన్నై ప్రారంభ ధర రూ.1,195
  • విశాఖపట్టణం-హైదరాబాద్ ధ‌ర‌ రూ.1,259
  • పాట్నా-కోల్‌కతా ధ‌ర‌ రూ.1,264
  • బెంగళూరు-చెన్నై రూ.1,285

More Telugu News