Salman Khan: మిగిలిన వారి సంగతేమో కానీ సంజయ్ లీలా భన్సాలీ నన్ను మాత్రం బాధపెట్టాడు: సల్మాన్ ఖాన్

  • 'పద్మావతి' సినిమా గురించి సెన్సార్ బోర్డు, సుప్రీంకోర్టు మాట్లాడుతాయి
  • నేను భన్సాలీకి రెండు హిట్లు ఇచ్చాను
  • నన్ను కాదని షారూఖ్ ని తీసుకున్నాడు
 బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘పద్మావతి’ వివాదం గురించి మీ స్పందన ఏంటి? ఈ సినిమాతో ఆయన చాలా మందిని బాధపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి?' అన్న ప్రశ్న సల్మాన్‌ ఖాన్ కు ఎదురైంది.

దానికి ఆయన సమాధానం ఇస్తూ, ‘దీని గురించి సెన్సార్‌ బోర్డు, సుప్రీం కోర్టు మాట్లాడుతాయి. అయితే మిగిలిన వారు ఆయన వల్ల బాధపడ్డారో లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఆయన వల్ల చాలా బాధపడ్డాను. నేను ఆయనకు రెండు సూపర్‌ హిట్స్‌ ఇచ్చాను. కానీ ఆయన తన తర్వాతి సినిమాకి షారుక్‌ ఖాన్‌ ని తీసుకున్నారు’ అంటూ ఇంత కాలం తరువాత తన మనసులో పేరుకున్న బాధను బయటపెట్టాడు.

 కాగా, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఖామోషీ’, ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత 'దేవదాస్' సినిమాకు సల్మాన్ ను కాదని షారూఖ్ ను తీసుకున్నాడు. దీనిపై అప్పట్లో భన్సాలీ వివరణ ఇస్తూ, ‘అతడు (సల్మాన్‌) నా నుంచి దీనిని ఆశించాడు, కాబట్టి నిరాశ చెందాడని నాకు అర్థమైంది. కానీ కొన్నిసార్లు దర్శకుడిగా నాకు అనిపించిందే చేయడం చాలా ముఖ్యం. ఓ నటుడిగా అతడ్ని నేను తక్కువ చేయలేదు. ఇప్పుడు నేనా సినిమా (‘దేవదాస్‌’) ను అతడితో తీశానా? లేదా? అనేది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే ఇప్పుడతను బాలీవుడ్ లో స్టార్ హీరో. అతని సినిమాలు బాక్సాఫీసు వద్ద 300 కోట్ల రూపాయల వసూళ్లు రాబడుతున్నాయి’ అన్నాడు.
Salman Khan
padmavathi
movie
sunjay leela bhanshali

More Telugu News