roja: కాలికి మ‌రోసారి చికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే రోజా.. వీడియో!

  • కొన‌సాగుతోన్న రోజా పాద‌యాత్ర‌
  • రోజా కాళ్ల‌కి త‌గ్గ‌ని బొబ్బ‌లు
  • వైద్యుల సూచ‌న‌లు తీసుకున్న ఎమ్మెల్యే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు, నగరి ఎమ్మెల్యే రోజా గాలేరు- నగరి ప్రాజెక్టు సాధన కోసం చేస్తోన్న పాదయాత్ర కొన‌సాగుతోంది. పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి మూడు రోజులు పూర్తయింది. పాదయాత్రలో ఆమె కాళ్లకు బొబ్బలు వచ్చిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆమె పాదయత్ర కొన‌సాగిస్తున్నారు. ఈ రోజు పలు ప్రాంతాల్లో పాద‌యాత్ర చేసిన రోజా.. త‌న కాలికి వైద్యుల‌తో చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు ఆమెకు పలు సూచ‌న‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో ఉంచారు.

More Telugu News