sai dharam tej: సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్?

  • ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా 
  • నితిన్ - శర్వానంద్ లతో ఓ సినిమా
  • తెరపైకి సాయిధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ ల పేర్లు

తెలుగు తెరకు మల్టీ స్టారర్ సినిమాలు కొత్తేమికాదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే పలకరిస్తూ వస్తున్నాయి. ఈ తరహా సినిమాలకి హీరోల ఇమేజ్ అడ్డుపడుతూ వచ్చింది. ఇక ఇటీవల కాలంలో హీరోలు విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ ఉండటం వలన, మల్టీ స్టారర్ సినిమాల జోరు పెరుగుతూ వస్తోంది.

ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా .. నితిన్ - శర్వానంద్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ లతోను మల్టీ స్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నారనీ, నిర్మాతలు కూడా రెడీగానే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక కావలసిందల్లా ఇద్దరికీ సరిపోయే కథే. ఆ విషయంపైనే దృష్టి పెట్టమని కొంతమంది యువ దర్శకులకు చెప్పారట. త్వరలోనే ఈ ప్రయత్నాలు ఫలించవచ్చని చెప్పుకుంటున్నారు.    

More Telugu News