west bengal: పశ్చిమ బెంగాల్ లో కలకలం.. చైనాలో జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగంగా చూపుతున్న పటాలు!

  • పదో తరగతి పరీక్షల్లో వక్రీకరించిన మ్యాపులు 
  • జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లను చైనాలో అంతర్భాగంగా చూపించారంటున్న బీజేపీ నేతలు
  • ఆరోపణలను ఖండించిన విద్యాశాఖ

జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లను చైనాలో భాగంగా చూపే మ్యాపులను విద్యార్థులకు అందజేశారని పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ ఆరోపిస్తోంది. పదో తరగతి విద్యార్ధుల ప్రశ్నాపత్రాలలో ఇలా వక్రీకరించిన దేశపటాలను ఇచ్చారని బెంగాల్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రాజు బెనర్జీ కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ, పదవ తరగతి భూగోళశాస్త్రం ప్రశ్నాపత్రంలో భాగంగా ఈ మ్యాపులను విద్యార్థులకు ‘‘పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (డబ్ల్యూబీబీఎస్ఈ) అందజేసిందని ఆరోపించారు. దీనిని ధ్రువీకరించే డబ్ల్యూబీబీఎస్ఈ బోర్డు వాటర్ మార్క్ కూడా వాటిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పని చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ ఉపాధ్యాయ సంఘాలేనని ఆయన ఆరోపించారు.

అయితే, ఆయన ఆరోపణలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ ఖండించారు. అవాస్తవాలతో వక్రీకరించిన మ్యాపులతో రాష్ట్ర ప్రజలను బీజేపీ నేతలు పెడదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. అసలు విద్యాశాఖలో అలాంటి మ్యాపులు రూపొందలేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News