polavaram: కొందరు డూప్లికేట్ల వల్లే పోలవరానికి ఇబ్బందులు... బీజేపీ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి అయ్యన్న

  • ఆది నుంచి బీజేపీలో ఉన్న నేతలు రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారు
  • డూప్లికేట్ బీజేపీ నేతలే అన్నింటికీ అడ్డం పడుతున్నారు
  • పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావులే పోలవరానికి అడ్డంకి
బీజేపీలోని కొందరు డూప్లికేట్ల వల్లే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు వస్తున్నాయని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు వంటి బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టుకి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ డూప్లికేట్ బీజేపీ నేతల తీరుతోనే సమస్యలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

 ఆది నుంచీ బీజేపీతోనే ఉండి ఎదిగిన అసలైన ఆ పార్టీ నేతలు రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు.
polavaram
ayyannapatrudu
criticism

More Telugu News