North Korea: అణు క్షిపణుల తయారీలో ఉత్తర కొరియా గొప్ప ముందడుగు!: నిపుణుల అంచనా

  • ఉత్త‌రకొరియా హ్వాసంగ్‌-15 క్షిపణిపై విశ్లేష‌కుల ఆందోళ‌న‌
  • అగ్ర‌రాజ్యం అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగల‌దు
  • సుదూర లక్ష్యాలను తాకగల క్షిపణులను ఉ.కొరియా త‌యారు చేసే అవ‌కాశం

యుద్ధ భ‌యం రేపుతోన్న ఉత్త‌ర‌కొరియా తాజాగా అత్యంత శ‌క్తిమంత‌మైన‌ ఖండాంతర క్షిపణిని త‌యారు చేసిన విష‌యం తెలిసిందే. ఈ హ్వాసంగ్‌-15 క్షిపణి 13,000 కిలో మీటర్లు ప్రయాణించగలదు. దీనిపై అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అది అగ్ర‌రాజ్యం అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలదని తేల్చి చెబుతున్నారు.

ఈ ప్రయోగం ద్వారా ఉత్తర కొరియా అణు క్షిపణుల తయారీలో గొప్ప ముందడుగు వేసిందని అంటున్నారు. ఇక‌పై సుదూర లక్ష్యాలను తాకగల ఖండాంతర క్షిపణులు తయారు చేయాలన్న ఉత్త‌ర కొరియా ఆశ‌యం త్వ‌ర‌లోనే నెరవేరొచ్చని అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా ఆ దేశం పరీక్షించిన క్షిప‌ణి సుమారు వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.

More Telugu News