Guntur: గుంటూరు ఆర్థోపెడిక్ సర్జన్ అరుదైన రికార్డు.. ఒకే రోజు పదిమందికి కీలు మార్పిడి ఆపరేషన్లు!

  • గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సొంత నిధులతో ఉచిత సర్జరీ
  • అరుదైన ఘటనగా గుర్తించిన ఐవోఏ
  • నరేంద్రరెడ్డిని సన్మానించిన ఐవోఏ

గుంటూరుకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి వైద్య రంగంలో అరుదైన రికార్డు సృష్టించారు. సాయిభాస్కర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ అయిన ఆయన ‘నీ రీప్లేస్‌మెంట్’ సర్జరీల్లో నిపుణుడు. గతేడాది ఒకే రోజు పదిమంది రోగులకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను దిగ్విజయంగా నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించారు. దేశంలోని ఆర్థోపెడిక్ వైద్యులందరూ ఏడాదిలో ఒక ‘నీ రీప్లేస్‌మెంట్’ సర్జరీ అయినా చేయాలనే పిలుపును ఇండయిన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఇచ్చింది.  

ఈ పిలుపు మేరకు సాయిభాస్కర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఉన్నతి ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షలు వెచ్చించి పదిమంది రోగులకు ఉచితంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఒకే రోజు పదిమంది రోగులకు సర్జరీ చేయడాన్ని అరుదైన విషయంగా గుర్తించిన వరల్డ్ రికార్డు అకాడమీ నరేంద్ర రెడ్డిని సన్మానించి, జ్ఞాపికను అందించింది. కాగా, గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌లను బూసిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

  • Loading...

More Telugu News