Narendra Modi: ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’కెక్కిన మోదీ పెన్సిల్ ఫొటో ఇదే!

  • రోజుకు ఏడు గంటల చొప్పున ఐదు నెలలపాటు శ్రమించిన మనోజ్ సోనీ
  • 80 చదరపు అడుగులతో పెన్సిల్ ఫొటో
  • ఫోన్ చేసి అభినందించి ఆహ్వానించిన మోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీ పెన్సిల్ చిత్రం ఒకటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.  గుజరాత్‌కు చెందిన కళాకారుడు మనోజ్ సోనీ రోజుకు ఏడు గంటల చొప్పున ఐదు నెలలపాటు శ్రమించి ఈ చిత్రాన్ని గీశాడు. మొత్తం 80 చదరపు అడుగుల పొడవున్న ఈ ఫొటో గురించి తెలుసుకున్న మోదీ స్వయంగా మనోజ్‌కు ఫోన్ చేసి అభినందించారు. ఈ నెల నాలుగో వారంలో ఢిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా మనోజ్‌ను ఆహ్వానించారు. మోదీ ఆహ్వానంతో మనోజ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

More Telugu News