Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తమిళ స్టార్ హీరో సరసన అనుష్క 
  • 'విశ్వరూపం 2' పనుల్లో కమల్ బిజీ 
  • పోస్ట్ ప్రొడక్షన్ లో విజయ్ 'షికారు'
  • హిందీ సినిమా రీమేక్ లో రానా 
*  తెలుగులో తాజాగా 'భాగమతి' చిత్రంలో నటించిన కథానాయిక అనుష్క తమిళంలో ఇప్పుడు అజిత్ సరసన నటించనుంది. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందే 'విశ్వాసం' చిత్రంలో కథానాయిక పాత్రకు అనుష్కను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  గత కొన్నాళ్లుగా పక్కన బెట్టిన 'విశ్వరూపం 2' చిత్రాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ మళ్లీ బయటకు తీశాడు. ఈ చిత్రం కోసం మిగిలివున్న షూటింగును పూర్తి చేసే పనిలో ప్రస్తుతం బిజీగా వున్నాడు. ఈ క్రమంలో ఆండ్రియాతో తన కాంబినేషన్ సీన్లను చెన్నయ్ లో చిత్రీకరిస్తున్నాడు.
*  'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'షికారు' షూటింగ్ ఇటీవలే పూర్తయింది. రాహుల్ సంక్రితియాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
*  ఇటీవల 'ఘాజి' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రానా దగ్గుబాటి తన తదుపరి చిత్రానికి ఏనుగుల బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు. నాలుగున్నర దశాబ్దాల క్రితం హిందీలో వచ్చిన 'హాథీ మేరా సాథీ' చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. దీనికి సోలోమన్ దర్శకత్వం వహిస్తాడు.       
Anushka Shetty
Kamal Haasan
Vijay
Rana

More Telugu News