khaki: 'ఖాకి' సినిమాపై మద్రాస్ హైకోర్టులో పిటిష‌న్‌!

  • ఓ సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌ర్చేలా ఉందన్న పిటిష‌న‌ర్‌
  • మొద‌ట స్టే విధించాలి
  • విచార‌ణ‌కు ఇద్దరు న్యాయవాదులతో కమిషన్‌ ఏర్పాటు చేయాలి

మ‌రో సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన 'ధీరన్' (తెలుగులో ఖాకి) సినిమాలో కార్తీ హీరోగా నటించాడు. అయితే, ఈ సినిమాను ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా చిత్రీకరించారని మధురైకు చెందిన పసుంపొన్ నిన్న‌ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమాపై స్టే విధించాలని ఆయ‌న కోరారు.

ఈ రోజు ఈ పిటిషన్‌పై న్యాయ‌స్థానం విచారణ జ‌రపగా పిటిషనర్‌ మాట్లాడుతూ.. తన ఆరోపణలపై పరిశీలన జరిపేందుకు ఇద్దరు న్యాయవాదులతో కమిషన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ సినిమాను న్యాయవాదులు చూసేందుకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాల్సి ఉంటుంద‌ని కోర్టు చెప్పింది. ఇందుకు అయ్యే ఖర్చు పిటిషనర్‌ భరిస్తారా? అనే విషయాన్ని త‌మ‌కు చెప్పాల‌ని ఆదేశించింది. ఒకవేళ పిటిష‌న‌ర్ ఇందుకు ఒప్పుకుంటే విచారణ చేస్తామని తెలిపి, కేసు వాయిదా వేస్తున్న‌ట్లు చెప్పింది.   

  • Loading...

More Telugu News