manikyala rao: మంత్రి మాణిక్యాల రావును క‌లిసిన‌ సీనియర్ నటుడు భానుచందర్!

  • అమ‌రావ‌తిలో మంత్రిని క‌లిసిన సినీ న‌టుడు
  • గంట‌సేపు మాట్లాడుకున్న వైనం
  • భానుచందర్ త‌న వ‌ద్ద‌కు రావడం ప‌ట్ల మాణిక్యాల రావు హ‌ర్షం
  • త‌న‌ సినిమాలను చాలా చూశానని మంత్రి చెప్పార‌న్న భానుచంద‌ర్‌

అమ‌రావ‌తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మాణిక్యాలరావును సీనియర్ నటుడు భానుచందర్ వ్య‌క్తిగ‌తంగా క‌లిశారు. వారిరువురూ దాదాపు గంట‌సేపు మాట్లాడుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ... త‌న వ‌ద్ద‌కు భానుచందర్ రావడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఆయ‌న త‌న‌ను అనుకోకుండా క‌లిశార‌ని వ్యాఖ్యానించారు.

భాను చంద‌ర్‌కి సామాజిక సృహ ఉంద‌ని అభినందించారు. భాను చందర్ ఇప్ప‌టికీ ఓ యువ‌కుడిగానే కనిపిస్తున్నాడ‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా భానుచందర్ మాట్లాడుతూ.. త‌న‌ సినిమాలను చాలా చూశానని మంత్రి మాణిక్యాలరావు చెప్పారని తెలిపారు. ఆయన ఈ మాట చెప్పడం ప‌ట్ల భాను చంద‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News