shikar dhavan: అభిమానిని ముందుకు తోసేసిన క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌.. వీడియో వైర‌ల్‌!

  • మూడో టెస్టు కోసం ఢిల్లీకి చేరుకున్న టీమిండియా
  • ఓ కార్య‌క్రమానికి హాజ‌రైన శిఖ‌ర్ ధావ‌న్‌
  • చూసేందుకు త‌ర‌లివ‌చ్చిన అభిమానులు
  • సెల్ఫీల కోసం ప్ర‌య‌త్నం.. ధావ‌న్‌కి ఆగ్ర‌హం

త‌న‌తో సెల్ఫీ దిగ‌డానికి వ‌చ్చిన ఓ అభిమానిని టీమిండియా బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్ తోసేశాడు. ఈ దృశ్యం మీడియాకు చిక్కింది. శ్రీలంకతో జ‌రుగుతోన్న టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భార‌త టీమ్‌ మూడో టెస్టు ఆడ‌డానికి ఢిల్లీ చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ శిఖ‌ర్ ధావ‌న్‌ను చూడ‌డానికి స్థానికులు భారీగా వచ్చారు.

దీంతో శిఖ‌ర్ ధావ‌న్ ముందుకు క‌ద‌ల‌డానికి కూడా ఇబ్బందిగా మారింది. శిఖ‌ర్ ధావ‌న్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వాల‌ని, ఆయ‌న‌తో సెల్ఫీ దిగాలని అభిమానులు ఎగ‌బ‌డ్డారు. ఓ అభిమాని శిఖ‌ర్ ధావ‌న్ ముందుకు వ‌చ్చేసి సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నించాడు. దీంతో ఆ అభిమానిని ధావ‌న్ ముందుకు తోసేశాడు. ధావ‌న్ తీరుపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  

More Telugu News