Pakistan: పాక్ పై ఒత్తిడి.. హఫీజ్ సయీద్ ని జైలుకి పంపే ప్రయత్నం?

  • గృహనిర్బంధం నుంచి విడుదల చేసిన పాక్
  • హఫీజ్ సయీద్ పై పాక్ యూటర్న్?
  • అంతర్జాతీయంగా పెరిగిన ఒత్తిడి


ఉగ్రవాది హఫీజ్ సయీద్ పై పాకిస్థాన్ యూటర్న్ తీసుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాది అనేందుకు సరైన సాక్ష్యాలు లేవని చెబుతూ న్యాయస్థానం అతనిని గృహనిర్బంధం నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుందని వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలో పర్వేజ్ ముషారఫ్ అతనిపై ప్రేమ చూపిస్తూ కశ్మీర్ లో ఉగ్రవాదం చేసేది హఫీజ్ సయీదేనని, తాను అతనికి అభిమానినని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కూడా పాక్ పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడడం పెద్దగా ఇష్టంలేని పాకిస్థాన్, యూటర్న్ తీసుకుంది. దీంతో అతనిపై మరోసారి కొత్త ఆరోపణలతో కేసు నమోదు చేసి జైలుపాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కాగా, అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్టులో హఫీజ్ సయీద్ ఉన్న సంగతి తెలిసిందే. అతని తలపై పది లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. 

More Telugu News