redmi: రూ. 4999కే రెడ్‌మీ 5ఏ స్మార్ట్‌ఫోన్‌... ఇది నిజంగా `దేశ్‌కా స్మార్ట్‌ఫోన్` అంటున్న నెటిజ‌న్లు

  • డిసెంబ‌ర్ 7 మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కు తొలిసేల్‌
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌
  • ఆక‌ట్టుకుంటున్న ఫీచ‌ర్లు

'దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌' అంటూ భార‌త మార్కెట్లోకి షియోమి సంస్థ ప్ర‌వేశ‌పెట్టిన రెడ్‌మీ 5ఏ స్మార్ట్‌ఫోన్ పేరుకు త‌గ్గ‌ట్లే ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో, అందుబాటు ధ‌ర‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ తొలిసేల్ డిసెంబ‌ర్ 7న మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్ స్టోర్‌లో ప్రారంభం కానుంది.

ఇవాళ జ‌రిగిన విడుద‌ల కార్య‌క్ర‌మంలో ఈ ఫోన్ ఫీచ‌ర్ల‌ను, ధ‌ర‌ను ప్ర‌క‌టించారు. దీని గురించి ప్ర‌త్యేకంగా రెడ్‌మీ ఇండియా అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్లు కూడా చేసింది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకుని, తొలి 50లక్షల రెడ్‌మి 5ఏ(2జీబీ+16జీబీ)ను రూ.4,999కే అందించనున్న‌ట్లు రెడ్‌మీ ఇండియా ప్ర‌క‌టించింది.
రెడ్‌మీ 5ఏ ఫీచర్లు

  • 5 అంగుళాల హెచ్‌డీ తాకే తెర
  • స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌
  • 2జీబీ ర్యామ్‌
  • 16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం
  • 5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు
  • ఆండ్రాయిడ్‌ నోగట్‌, ఎంఐయూఐ 9 వెర్షన్‌
  • 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

  • Loading...

More Telugu News