KTR: ఒకే వేదికను పంచుకుని ప్రసంగించనున్న కేటీఆర్, నారా లోకేష్!

  • హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్సుకు హాజరుకానున్న కేటీఆర్, లోకేష్
  • ఇద్దరూ కలసి పాల్గొంటున్న సదస్సు కావడంతో.. సర్వత్ర ఆసక్తి
  • హాజరుకానున్న కమల్, సురేష్ ప్రభు

తెలంగాణ, ఏపీ ఐటీ మంత్రులు కేటీఆర్, నారా లోకేష్ లు తొలిసారి ఒకే వేదికను పంచుకోనున్నారు. 2018 ఫిబ్రవరిలో జరగనున్న 'హార్వర్డ్ ఇండియా' 15వ వార్షికోత్సవం దీనికి వేదిక కానుంది. యువనేతలు ఇద్దరూ ఇప్పటికే తమ ఆహ్వానాన్ని అంగీకరించారని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్ ఇప్పటికే అధికారికంగా ధ్రువీకరించగా, లోకేష్ ఇంకా స్పందించలేదు. ఈ యువనేతలు ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కలసి పాల్గొంటున్న తొలి సదస్సు కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

అమెరికాలో జరిగే అతిపెద్ద ఇండియా కాన్ఫరెన్సుల్లో 'హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్' కూడా ఒకటి. ప్రభుత్వ అధికారులు, వాణిజ్యవేత్తలు, దాతృత్వకారులు, రాజకీయవేత్తలు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కాన్ఫరెన్సుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరై, ప్రసంగించారు. ఈసారి కాన్ఫరెన్సుకు కమలహాసన్, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ తదితరులు కూడా వెళ్తున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News