sai dharamtej: ప్రీమియర్ షోలతో రెడీ అవుతోన్న 'జవాన్'

  • భారీస్థాయిలో 'జవాన్' రిలీజ్ రేపే 
  • శ్రీరాములయ్య థియేటర్లో ప్రీమియర్ షోలు 
  • సక్సెస్ పై నమ్మకం పెట్టుకున్న తేజు    

బీవీఎస్ రవి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా 'జవాన్' చిత్రం తెరెకెక్కింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హైదరాబాద్ లో ప్రీమియర్ షోలకు రెడీ అవుతోంది. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి హైదరాబాద్ - శ్రీరాములయ్య థియేటర్లో ప్రీమియర్లు వేయనున్నారు.

ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో బీవీఎస్ రవి వున్నాడు. ఇక ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే ఆశతో తేజు వున్నాడు. ఇప్పటివరకూ చేసిన పాత్రలకి భిన్నమైన పాత్ర చేయడం వలన, మెహ్రీన్ కూడా ఈ సినిమా మీద నమ్మకంతోనే వుంది. ఇప్పటికే టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమాలో, మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.     

  • Loading...

More Telugu News