mamata benarji: మైక్‌ అనుకుని సెక్యూరిటీ గార్డు చేతిలోని టార్చ్‌లైట్‌ తీసుకున్న మ‌మ‌తా బెన‌ర్జీ.. వీడియో వైరల్!

  • ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌మ‌తా బెన‌ర్జీ
  • మైక్ అనుకుని టార్చ్‌లైట్ ప‌ట్టుకోగానే ఆమె ముఖంపై వెలుతురు
  • టార్చ్‌లైట్ తీసుకుని.. మైక్‌ను ఇచ్చిన సిబ్బంది

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పాల్గొన్న ఓ కార్య‌క్ర‌మంలో స‌ర‌దా సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మైక్‌ అనుకుని సెక్యూరిటీ గార్డు చేతిలోని టార్చ్‌లైట్‌ తీసుకున్నారు మ‌మ‌తా బెన‌ర్జీ. ఆ టార్చ్‌లైట్‌ ఆన్‌లోనే ఉంది. మ‌మ‌తా బెన‌ర్జీ త‌న నోటి వ‌ద్ద దాన్ని ఉంచుకుని ప్ర‌సంగించ‌బోగా టార్చి లైట్ వెలుతురు ఆమె మీద ప‌డింది. దీంతో అక్క‌డి సిబ్బంది ఆమె చేతిలోని టార్చ్‌లైట్‌ను తీసుకుని మైక్‌ ఇచ్చారు. ఈ స‌ర‌దా సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో అంత‌ర్జాలంలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు సెటైర్లు వేసుకుంటున్నారు. మీరూ చూడండి...



More Telugu News