Bhagavadgeeta: నాడు అర్జునునికి కృష్ణుని హితబోధ... నేడు గీతా జయంతి!

  • నాడు అర్జునునికి శ్రీకృష్ణని ఉపదేశం
  • నేటికీ ఆచరణయోగ్యమే
  • వన్నెతగ్గని నవజీవన సమర మార్గదర్శి
  • నేడు కృష్ణ మందిరాల్లో ప్రత్యేక ఉత్సవాలు

భగవద్గీత... తన వారిని చంపాల్సి వస్తుందన్న మనో వ్యాకులతతో తన ముందు నిలబడిన పాండవ మధ్యముడిని ఉద్దేశించి భగవంతుడు చెప్పిన ఉపదేశం. వేల ఏళ్ల నాడు ద్వాపరయుగ అంతం సమీపిస్తున్న వేళ, కౌరవ, పాండవ యుద్ధం జరుగగా, భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి ఉద్ధండులైన తన గురు, బంధుగణాన్ని చూస్తూ, వారినెలా అంతమొందించగలనన్న సంశయంతో ఉన్న అర్జునుడికి, కర్ణోపదేశంగా కృష్ణుడు చెప్పిన స్ఫూర్తి పలుకులే భగవద్ఘీత.

ఆనాడు మార్గశిర శుద్ధ ఏకాదశి... కాబట్టే నేడు గీతా జయంతి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కృష్ణ మందిరాల్లో ఉత్సవాలు సాగుతున్నాయి. కర్మ అంటే కర్తవ్య పాలనేనని, తదుపరి సంభవించే పరిణామాలు భగవంతుని ఆదేశాలేనని, మనిషి నిమిత్తమాత్రుడని కృష్ణుడు నాడు చెప్పిన ఉపదేశం... నేటికీ వన్నెతగ్గని నవజీవన సమర మార్గదర్శే. చేసేది, చేయించేది తానేనని భరోసాను ఇస్తూ, మానసిక బలహీనలతలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పే గీత, హిందూ జాతికి లభించిన వెలలేని కానుకేనని చెప్పడంలో సందేహం లేదు.

More Telugu News