Pink Promise Diamond: 207 కోట్లకు 'పింక్ ప్రామిస్' వజ్రాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి

  • రికార్డు ధర పలికిన పింక్ ప్రామిస్ డైమండ్
  • హాంగ్ కాంగ్ లో క్రీస్టీస్ సంస్థ వేలం
  • ఫోన్ ద్వారా డైమండ్ కొనుగోలు చేసిన అజ్ఞాత వ్యక్తి
కళ్లు మిరుమిట్లు గొలిపే ‘పింక్‌ ప్రామిస్‌’ అనే వజ్రాన్ని అజ్ఞాత వ్యక్తి 207 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేయడం ఆసక్తి రేపుతోంది. క్రిస్టీస్ సంస్థ హాంగ్ కాంగ్ లో నిర్వహించిన వేలంలో అరుదైన ఈ పింక్ ప్రామిస్ వజ్రాన్ని 32.16 మిలియన్ డాలర్ల (207 కోట్ల రూపాయాలకు పైగా) ధరకు అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ ద్వారా కొనుగోలు చేశాడు. గులాబీ రత్నాలు పొదిగిన ఈ 14.93 క్యారెట్ల వజ్రాన్ని క్యారెట్ 2.13 మిలియన్ డాలర్ల చొప్పున కొనుగోలు చేసినట్టు క్రిస్టీస్ సంస్థ తెలిపింది. ఈ పింక్ ప్రామిస్ వజ్రం అరుదైనదని క్రిస్టీస్ వెల్లడించింది. 
Pink Promise Diamond
Christie’s
Hong Kong
14.93-carat diamond

More Telugu News