amritha: జ‌య‌ల‌లిత త‌న కూతురి గురించి ఎవ్వ‌రికీ చెప్పొద్ద‌ని ఒట్టేయించుకున్నారు!: జయ మేనత్త కూతురు ప్రకటన

  • 1980లో మా పెద్దమ్మ జయలలితకు పురుడు పోశారు
  • అమృత.. జ‌య‌ల‌లిత కూతురో కాదో నాకు తెలియ‌దు- జయ మేనత్త కూతురు
  • నేను జ‌య కూతురిన‌ని ఓపీఎస్‌కు తెలుసు: అమృత‌
  • హైకోర్టులో పిటిష‌న్ వేస్తా

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జయలలితకు కూతురు ఉంద‌ని ఆమె మేనత్త కూతురు ల‌లిత అన్నారు. తాను జ‌య‌ల‌లిత కూతురిననీ, ఈ విషయం ప‌న్నీర్ సెల్వంకి కూడా తెలుస‌ని అమృత అనే బెంగ‌ళూరు యువ‌తి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ల‌లిత ఇటువంటి ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, జ‌య‌లలిత కూతురు అమృతేనా? కాదా? అన్న విష‌యం మాత్రం త‌న‌కు తెలియ‌ద‌ని తెలిపారు. జయల‌లిత‌ తండ్రి జయరామన్‌ సోదరి జయశిఖ కుమార్తె అయిన లలిత బెంగుళూరులో ఉంటున్నారు.

తాజాగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... చెన్నైలోని మైలాపూర్‌లో 1980లో తన‌ పెద్దమ్మ జయలలితకు పురుడు పోశారని చెప్పారు. జయల‌లిత తల్లి మృతిచెందడంతో త‌న‌ పెద్దమ్మ ప్రసవం చేయాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. తనకు బిడ్డ జన్మించినట్లు ఎవరకీ చెప్పొద్ద‌ని త‌న‌ పెద్దమ్మతో జయల‌లిత‌ ఒట్టు వేయించుకుంద‌ని ల‌లిత‌ అన్నారు. జ‌య‌ల‌లిత కూతుర‌ని అమృత‌ చెప్పుకుంటే డీఎన్‌ఏ పరిశోధనల ద్వారానే ఈ విష‌యాన్ని నిర్ధారించ‌వ‌చ్చ‌ని అన్నారు.  

ఇదిలా ఉంచితే, జ‌య‌ల‌లిత కూతురిన‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన అమృత మాట్లాడుతూ.. ఆగస్టు 14, 1980న బెంగళూరులో త‌న‌కు జయలలిత జ‌న్మ‌నిచ్చింద‌ని తెలిపారు. జయలలిత మేనత్త జయలక్ష్మి పురుడు పోశారని చెప్పారు. అనంత‌రం మూడు నెల‌ల‌కి త‌న‌ సోదరి శైలజకు జయలలిత త‌న‌ను ఇచ్చేసింద‌ని, త‌న పేరు అమృత అని పెట్టార‌ని తెలిపారు.

త‌న‌కు మంజుల అనే మ‌రో పేరు కూడా ఉంద‌ని చెప్పారు. తనను పెంచిన తల్లిదండ్రులు పోయారని , ఆ తర్వాతే త‌న‌కు ఈ నిజం తెలిసింద‌ని చెప్పారు. ఈ విష‌యం పన్నీర్ సెల్వంకి తెలుస‌ని అన్నారు. తన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేద‌ని, తాను కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని ఆమె పేర్కొన్నారు. 

More Telugu News