Chandrababu: నా వల్లే హైదరాబాద్ కి మెట్రో రైలు వచ్చింది!: చంద్రబాబు

  • మెట్రో రైలు జాబితాలో హైదరాబాద్ ను చేర్పించింది నేనే
  • ఈ ప్రాజెక్టును వైయస్ ఆలస్యం చేశారు
  • హైదరాబాదుపై మా ముద్ర చిరకాలం ఉంటుంది
హైదరాబాద్ మెట్రో రైలు కోసం అప్పటి ముఖ్యమంత్రిగా తాను పోరాటం చేశానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేవలం బెంగళూరు, అహ్మదాబాద్ లకు మాత్రమే మెట్రోను పరిమితం చేస్తే... తాను పోరాడి హైదరాబాదును కూడా ఆ జాబితాలో చేర్పించానని చెప్పారు. తన వల్లే హైదరాబాద్ మెట్రో రైలు వచ్చిందని తెలిపారు. మెట్రోను ఆలస్యం చేసిన ఘనత మాత్రం వైయస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుందని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో తమ ముద్ర ఎప్పటికీ నిలిచి పోతుందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీలోనే తెలుగు ఉందని... తెలుగు భాష పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు. గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేలా చూస్తామని చెప్పారు. న్యాయపాలన కూడా తెలుగులోనే ఉండాలని రఘునాథ్ రెడ్డి కమిటీ సూచించిందని తెలిపారు.
Chandrababu
ys rajasekhara reddy
hyderabad metro rail

More Telugu News