agnathavasi: మొట్ట‌మొద‌టి సారి డ‌బ్బింగ్ చెప్పానోచ్‌!: ఫొటోలు షేర్ చేసిన‌ 'అజ్ఞాతవాసి' హీరోయిన్

  • అజ్ఞాతవాసి సినిమాలో ఒక హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యూయేల్‌
  • త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్‌
  • శ‌ర‌వేగంగా షూటింగ్‌

తాను మొట్ట‌మొద‌టి సారి డ‌బ్బింగ్ చెప్పాన‌ని హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ సంబ‌ర‌ప‌డిపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'అజ్ఞాతవాసి' లో అనూ ఇమ్మాన్యుయేల్ ఒక హీరోయిన్ ‎గా నటిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఈ చిన్నది త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల‌ను ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో ఓ స‌ర‌దా సీన్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి ఆమె న‌టించిన దృశ్యం కూడా ఈ పోస్ట్ లో క‌న‌ప‌డింది. ఆమె ప‌క్క‌న ఉన్న మానిటర్లో ప‌వ‌న్ అనూ ఇమ్మాన్యూయేల్ ల మ‌ధ్య జ‌రిగిన షూటింగ్‌కి సంబంధించిన దృశ్యం ఉంది. అనిరుద్ సంగీతంలో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News