swati: కృష్ణవంశీ గారినే స్క్రిప్ట్ చెప్పమని అడిగా .. ఆయనకి కోపం రాకుండా ఎందుకుంటుంది?: స్వాతి

  • కృష్ణవంశీ గారి సినిమాలు చూశాను 
  • కానీ ఆయనే కృష్ణవంశీ అని తెలియదు
  • స్క్రిప్ట్ చెబుతారా అని అడిగాం 
  • స్క్రీన్ టెస్ట్ చేసి మెచ్చుకున్నారు    

బుల్లితెరపై ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వాతి, ఆ తరువాత 'డేంజర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. కృష్ణవంశీ దర్శకత్వంలో 2005లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి తనకి ఎదురైన అనుభవాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో స్వాతి చెప్పుకొచ్చింది.

" 'డేంజర్' సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు నేను మా అమ్మతో కలిసి కృష్ణవంశీ గారి ఆఫీసుకి వెళ్లాను. అక్కడి రూమ్ లో ఒకాయన కూర్చుని వున్నారు .. కృష్ణవంశీ గారి సినిమాలు చూశాము కానీ, ఆయనే కృష్ణవంశీ అనే విషయం మాకు తెలియదు. దాంతో మేం ఆ రూమ్ లో కూర్చుంటూనే .. స్క్రిప్ట్ చెబుతారా?" అని అడిగాం. అంతే .. ఆయన ఒక పెన్నుతో పేపర్ పై 'కె.వి' అని రాసి .. దానిని మా వైపు తోశారు. "మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?" అని అడిగారు.

"అంతటితో మా అమ్మ ఊరుకోకుండా .. "మీరు ఏయే సినిమాలు తీశారండీ?" అని అడిగింది. "నన్నే ఇలా అడుగుతారా?" అంటూ ఆయనకి కోపం వచ్చేసింది. "అసలు నువ్ చేయగలవో లేదో చూస్తాను పదా .." అంటూ నాకు స్క్రీన్ టెస్ట్ చేశారు .. బాగా చేశానని మెచ్చుకున్నారు. ఆ సినిమా చేసేటప్పుడే అయన గొప్పతనమేమిటో తెలిసింది .. ఆయనంటే గౌరవం పెరిగింది" అంటూ స్వాతి చెప్పుకొచ్చింది.       

More Telugu News